KANYASULKAM
మహానటి సావిత్రి(2)::
పాత్రోచిత సహజ నటనా సామ్రాజ్ఞి సావిత్రి,నవరస భరిత మహోన్నత
నటనా మనోహరాజ్ఞి సావిత్రి,నవ పల్లవ లాలిత్య నవనీత నటనా
నాదోపాస కోమలాజ్ఞి సావిత్రి,సరస సల్లాప సందోహ సౌకుమార్య
సమున్నత నటనా విదూషాజ్ఞి సావిత్రి,మేలైన యువతకు జోడైన
నిత్య నూతన విద్యార్ధిని సావిత్రి,భావ గాంభీర్య చిరు దరహాస వదన
వీర విహారి సావిత్రి, విషాద పాత్ర పోషణ పరమావధి యందు పండిత
పామర జన హృదయ రాజ్ఞి సావిత్రి,మెండైన తెలుగు తెరకు నిండైన
విగ్రహ రూప లావణ్య లతాజ్ఞి సావిత్రి,సాటి గలరే వేరెవ్వరు మన సావిత్రికి!!